*ఈనెల 15 నుండి 18 నల్లగొండలో జరిగే అఖిల భారత రైతు సంఘం ( ఏ ఐ కేస్ ) 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి* -- *15వ తేదీన నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు వేలాదిగా తరలి రావాలి* *తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మట్టిపల్లి సైదులు*
చివ్వెంల :తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పురిటిగడ్డ నల్లగొండ జిల్లా కేంద్రంలో ఈనెల 15 నుండి 18 వరకు నిర్వహిస్తున్న అఖిల భారత రైతు సంఘం ( ఏ ఐ కె ఎస్ ) 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మట్టి పెల్లి సైదులు పిలుపునిచ్చారు. మహాసభల తొలిరోజైన నవంబర్ 15న నిర్వహించే భారీ బహిరంగ సభకు రైతులు, కౌలుదారులు, వ్యవసాయ కార్మికులు, పెద్ద ఎత్తున తరలిరావాలని అన్నారు. సోమవారం చివ్వెంల మండల కేంద్రంలోరైతు సంఘం ఆలిండియా మహాసభల జయప్రదం కోరుతూ నిర్వహిస్తున్న ప్రచారంలో భాగంగ ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతులు తమూ పండించిన పంటను మార్కెట్ కు తెచ్చి పదిహేను, ఇరువై రోజులు గడుస్తున్న ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్లో రైతులకు మౌలిక వసతులతో పాటు ధాన్యం నిల్వ కోసం పట్టాలు కూడా ఇవ్వాలని సూచించారు. రైతుల హక్కుల కోసం నిరంతరం దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతున్న అఖిల భారత రైతు సంఘం నల్లగొండ జిల్లా కేంద్రంలో జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నారని తెలిపారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం అన్ని పంటలకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర ( ఎం ఎస్ పి ) కల్పించాలి వారు డిమాండ్ చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలని కుట్రలను చేస్తున్నారని రైతులందరూ ఐక్యంగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ నుండి కాపాడం కోసం పోరాడాలని అన్నారు. అప్పుల ఊబిలో ఉన్న రైతులకు ఏకకాలంలో పూర్తి రుణమాఫీ ప్రకటించి, నూతన రుణ సదుపాయం కల్పించాలి డిమాండ్ చేసినారు. వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలని సకాలంలో ఎరువులు, విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేయాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతాంగానికి తక్షణమే పంట బీమా, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల హక్కుల కోసం, వారి సమస్యలపై, కార్పొరేటీ విధానాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక సమస్యల పైన చర్చించి ఉద్యమాలు రూపొందించడానికి నల్లగొండలో నిర్వహిస్తున్న మహాసభలు వేదిక కాబోతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ ఇట్ట మల్ల స్టాలిన్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పెరుమాండ్ల రాజారావు, సులేమాన్, మల్లయ్య, పద్మ, మంజుల, మల్లమ్మ పాల్గొన్నారు.