*ఈనెల 15 నుండి 18 నల్లగొండలో జరిగే అఖిల భారత రైతు సంఘం ( ఏ ఐ కేస్ ) 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి* -- *15వ తేదీన నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు వేలాదిగా తరలి రావాలి* *తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మట్టిపల్లి సైదులు*
చివ్వెంల :తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పురిటిగడ్డ నల్లగొండ జిల్లా కేంద్రంలో ఈనెల 15 నుండి 18 వరకు నిర్వహిస్తున్న అఖిల భారత రైతు సంఘం ( ఏ ఐ కె ఎస్ ) 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మట్టి పెల్లి సైదులు పిలుపునిచ్చారు. మహాసభల తొలిరోజైన నవంబర్ 15న నిర్వహించే భారీ బహిరంగ సభకు రైతులు, కౌలుదారులు, వ్యవసాయ కార్మికులు, పెద్ద ఎత్తున తరలిరావాలని అన్నారు. సోమవారం చివ్వెంల మండల కేంద్రంలోరైతు సంఘం ఆలిండియా మహాసభల జయప్రదం కోరుతూ నిర్వహిస్తున్న ప్రచారంలో భాగంగ ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతులు తమూ పండించిన పంటను...