తుపాను ఎఫెక్ట్.. సూర్యాపేట జిల్లాకు హై అలర్ట్ *నేటి సాయంత్రం 4 నుంచి రేపు మధ్యాహ్నం వరకు ప్రయాణాలు బంద్ చేయాలి* *గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం* *అధికారులతో కలెక్టర్ అత్యవసర వెబెక్స్ సమావేశం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన*

సూర్యాపేట :బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తుపాను ప్రభావం సూర్యాపేట జిల్లాపై ఉండే అవకాశం ఉందని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. జిల్లాలో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో పాటు క్షేత్రస్థాయి సిబ్బందితో కలెక్టర్ అత్యవసర వెబెక్స్ సమావేశం నిర్వహించారు. తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. *గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు* తుపాను ప్రభావంతో జిల్లాలో గాలుల వేగం క్రమంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం గంటకు 40...