ఓబీసీ కాలమ్ ఎందుకు చేర్చడం లేదు బీసీ హక్కుల సాధన సమితి ధనుంజయ నాయుడు సూటి ప్రశ్న

సూర్యాపేట : ఓబీసీ కాలమ్ ఎందుకు చేర్చడం లేదో దేశ ప్రజలకు బిజెపి సమాధానం చెప్పాలని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు అన్నారు మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కార్యాలయం బొమ్మగాని ధర్మభిక్షం భవం లో ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..... జాతి జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చాలని ప్రధాన డిమాండ్ తో బీసీలు రోడ్డు ఎక్కి ఉద్యమిస్తుంటే కేంద్ర ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లైనా లేకపోవడం సిగ్గుచేటని, ఓ బి సి కాలమ్ చేర్చే వరకు కేంద్రంపై పోరాటం కొనసాగిస్తామని బీసీల లెక్కలు తేలితే...