*ఓడినా.. జీవితంలో ఓడిపోలేదు* *బిగ్‌బాస్‌ నుంచి సూర్యాపేటకు వచ్చిన ఝాన్సీకి అభిమానుల ఘన స్వాగతం*

సూర్యాపేట : బిగ్‌బాస్‌ కార్యక్రమంలో ఎనిమిది వారాల పాటు కొనసాగి ఎలిమినేట్‌ అయిన ఝాన్సీ మంగళవారం సూర్యాపేటకు చేరుకోగా పట్టణ ప్రజలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో లక్షలాది మందిలో తనను ఎంపిక చేశారంటే అది అభిమానులు తనపై చూపిన ఆదరాభిమానాలేనని అన్నారు. ఎనిమిది వారాల పాటు తనకు మద్దతుగా నిలిచి, ఆదరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.బిగ్‌బాస్‌ నుంచి ఎలిమినేట్‌ అయినప్పటికీ జీవితంలో మాత్రం తాను ఓడిపోలేదని, అభిమానుల ప్రేమాభిమానాలే తనకు కొండంత బలమని పేర్కొన్నారు. సూర్యాపేటలో భాను, శ్రీకాంత్‌ అందించిన మద్దతు, సహకారం ఎంతో ప్రత్యేకమని, వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. తన...