*నేటి జీవనశైలిలో ఒత్తిడి తగ్గించుకోవడానికి నిత్య యోగ సాధన ఎంతో అవసరం* సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం నిర్వాహకులు యోగా గురువు చాడపాపిరెడ్డి

సూర్యాపేట : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైన ఒత్తిడికి గురవుతున్నారనీ , ఒత్తిడి జయించి మానసిక ప్రశాంతత పొందాలంటే నిత్యం యోగా సాధన ఎంతో అవసరమని సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం నిర్వాహకులు యోగా గురువు చాడపాపిరెడ్డి తెలిపారు. బుధవారం జాతీయ ఒత్తిడి అవగాహన దినోత్సవం సందర్భంగా యోగాసాధకులతో కలిసి మాట్లాడారు. మనిషి జీవితంలో ఉద్యోగ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతలు, పోటీ ప్రపంచం, భవిష్యత్తుపై ఆందోళనలు మనిషి మానసిక ప్రశాంతతను దూరం చేస్తున్నాయి అన్నారు. ఒత్తిడి అనేది జీవితంలో సహజమైనదే అయినప్పటికీ, దానిని నియంత్రించుకోలేకపోతే మన శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే...