*జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు - జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్* *ముందస్తు అనుమతులు లేకుండా ప్రజా బహిరంగ కార్యక్రమాలు, సభలు, ర్యాలీలు నిషేధం.* *నవంబర్ 30వ తేదీ వరకు నిబంధనలు వర్తిస్తాయి* *నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు.*
సూర్యాపేట : శాంతి భద్రతల పరిరక్షణ దృశ్య, జిల్లాలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా, జిల్లాలో ఉన్న ప్రశాంత వాతావరణం భంగం కాకుండా, సవ్యంగా కొనసాగించడానికి ఈనెల 30 తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... 30 పోలీస్ ఆక్ట్ అమల్లో ఉన్నందున జిల్లాలో డిఎస్పి లేదా ఆ పై స్థాయి అధికారుల నుండి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ప్రజా సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమి...