*సమాజ సేవ ఏ లక్ష్యంగా శ్రీ వాసవి సేవా సమితి సేవలు*

సూర్యాపేట టౌన్ : సమాజసేవయే లక్ష్యంగా శ్రీ వాసవి సేవా సమితి సేవలు అందిస్తుందని శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బచ్చు పురుషోత్తం తెలిపారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్ లో శ్రీ వాసవి సేవా సమితి వ్యవస్థాపక జాతీయ చైర్మన్ పూరి సురేష్ శెట్టి 55వ జన్మదిన సందర్భంగా పేద ప్రజలకు అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ సేవ లక్ష్యంగా గత పది సంవత్సరముల క్రితం వనపర్తికి చెందిన పూరి సురేష్ శెట్టి శ్రీ వాసవి సేవా సమితి స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోనీ పలు...