కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల కనీస వేతనాలను పెంచాలి. ఎం.శ్రీనివాస్ ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
సూర్యాపేట టౌన్ : తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, స్కీం వర్కర్లు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తుంటే వారికి కనీస వేతనాలు పెంచుతామని ఎన్నికలకు ముందు ప్రకటించి అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటుతున్న పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ అన్నారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్ టి యు) సూర్యపేట జిల్లా కమిటీ సమావేశం జిల్లా ఉపాధ్యక్షులు కామల్ల శ్రీను అధ్యక్షతన చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఐఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ...