Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

ఓబీసీ కాలమ్ ఎందుకు చేర్చడం లేదు బీసీ హక్కుల సాధన సమితి ధనుంజయ నాయుడు సూటి ప్రశ్న

Author
Posted By RK SAKSHI
| 03 Nov 2026, 03:52 PM | Politics
ఓబీసీ కాలమ్ ఎందుకు చేర్చడం లేదు  బీసీ హక్కుల సాధన సమితి ధనుంజయ నాయుడు సూటి ప్రశ్న

సూర్యాపేట : ఓబీసీ కాలమ్ ఎందుకు చేర్చడం లేదో దేశ ప్రజలకు బిజెపి సమాధానం చెప్పాలని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు అన్నారు
మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కార్యాలయం బొమ్మగాని ధర్మభిక్షం భవం లో ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.....
జాతి జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చాలని ప్రధాన డిమాండ్ తో బీసీలు రోడ్డు ఎక్కి ఉద్యమిస్తుంటే కేంద్ర ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లైనా లేకపోవడం సిగ్గుచేటని, ఓ బి సి కాలమ్ చేర్చే వరకు కేంద్రంపై పోరాటం కొనసాగిస్తామని బీసీల లెక్కలు తేలితే తమకు భవిష్యత్తులో రాజకీయంగా నష్టం జరుగుతుందనే కుట్రతోనే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రస్తుతం జరిగే జన గణనలో ఓబీసీ కాలమ్ చేర్చడం లేదని, కుల గణన చేయకుండా బీసీ వ్యతిరేక పార్టీగా మిగిలిపోతారని భవిష్యత్తులో ఆ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుందని ఇప్పటికే బిజెపి అగ్రవర్ణాల పార్టీగా ముద్ర వేసుకున్నదని ఇక జనగణన లో ఓబిసి కాలమ్ లేకపోతే బీసీలు మరి కొన్ని దశాబ్దాల కాలం వెనుకబాటు తనానికి గురవుతారని అలాగే బీసీ కుల గణన చేయాలని డిమాండ్ చేయని పార్టీలు కూడా బీసీ ద్రోహులు గానే చరిత్రలో మిగిలిపోతారని జాతీయస్థాయిలో ఐక్య ఉద్యమాలు నిర్మిస్తామని ముఖ్యంగా ఇండియా కూటమిలోని అన్ని రాజకీయ పార్టీలు బీసీ ఉద్యమానికి మద్దతునివ్వాలని ఎన్డీఏ కూటమిలోని రాజకీయ పక్షాలు ఆత్మ పరిశీలన చేసుకుని బీసీల పక్షాన ఉండాలా బిసి వ్యతిరేక పార్టీలుగా మిగిలిపోవాలో తేల్చుకోవాలని ఆయన అన్నారు. ఆయన వెంట బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ఇంచార్జ్ బూర వెంకటేశ్వర్లు జిల్లా గౌరవాధ్యక్షుడు చిలకరాజు శ్రీను జిల్లా సహాయ కార్యదర్శి కొమర్రాజు వెంకట్ ఉన్నారు.

అత్యధికంగా చదివినవి
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి.   ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి.   కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి.   తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..*   *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.*   * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..* *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.* * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.