Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

*నేటి జీవనశైలిలో ఒత్తిడి తగ్గించుకోవడానికి నిత్య యోగ సాధన ఎంతో అవసరం* సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం నిర్వాహకులు యోగా గురువు చాడపాపిరెడ్డి

Author
Posted By RK SAKSHI
| 04 Nov 2026, 08:09 PM | TELANGANA
*నేటి జీవనశైలిలో ఒత్తిడి తగ్గించుకోవడానికి నిత్య యోగ సాధన ఎంతో అవసరం*    సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం నిర్వాహకులు యోగా గురువు చాడపాపిరెడ్డి

సూర్యాపేట : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైన ఒత్తిడికి గురవుతున్నారనీ , ఒత్తిడి జయించి మానసిక ప్రశాంతత పొందాలంటే నిత్యం యోగా సాధన ఎంతో అవసరమని సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం నిర్వాహకులు యోగా గురువు చాడపాపిరెడ్డి తెలిపారు. బుధవారం జాతీయ ఒత్తిడి అవగాహన దినోత్సవం సందర్భంగా యోగాసాధకులతో కలిసి మాట్లాడారు. మనిషి జీవితంలో ఉద్యోగ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతలు, పోటీ ప్రపంచం, భవిష్యత్తుపై ఆందోళనలు మనిషి మానసిక ప్రశాంతతను దూరం చేస్తున్నాయి అన్నారు. ఒత్తిడి అనేది జీవితంలో సహజమైనదే అయినప్పటికీ, దానిని నియంత్రించుకోలేకపోతే మన శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.ఒత్తిడి ఎక్కువైనప్పుడు మనస్సులో ఆందోళన, చిరాకు, ఏకాగ్రత లోపం, నిద్రలేమి వంటి సమస్యలు ఎదురవుతాయనీ తెలిపారు.దీర్ఘకాలిక ఒత్తిడి శరీర ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు అని, అందువల్ల ఒత్తిడిని గుర్తించి, దానిని తగ్గించుకునే ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం అన్నారు. ఒత్తిడిని తగ్గించడంలో యోగా ఒక అద్భుతమైన సాధన అని, యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం ద్వారా శరీరానికి విశ్రాంతి లభించడంతో పాటు మనస్సు ప్రశాంతంగా ఉండేందుకు సహాయపడుతుందన్నారు. నిత్య యోగ సాధన వల్ల శ్వాసపై నియంత్రణ, మానసిక స్థిరత్వం, ఏకాగ్రత, సానుకూల ఆలోచనలు పెంపొందించుకోవచ్చు అన్నారు.
ప్రతిరోజూ కొంత సమయం యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం కోసం కేటాయించడం ద్వారా మనిషి తనలోని ఆందోళనను తగ్గించుకొని ప్రశాంతమైన జీవనాన్ని అలవాటు చేసుకోవచ్చు. యోగాతో పాటు సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, నడక, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడం కూడా ఒత్తిడి నియంత్రణకు తోడ్పడతాయి అన్నారు.ఒత్తిడిని పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా, దానిని సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తిని యోగా మనకు అందిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకొని శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను పొందాలని సూచించారు. ఈ కార్య క్రమంలో పలువురు యోగాసాధకులు పాల్గొన్నారు.

అత్యధికంగా చదివినవి
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి.   ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి.   కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి.   తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..*   *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.*   * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..* *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.* * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.