Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

*జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు - జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్* *ముందస్తు అనుమతులు లేకుండా ప్రజా బహిరంగ కార్యక్రమాలు, సభలు, ర్యాలీలు నిషేధం.* *నవంబర్ 30వ తేదీ వరకు నిబంధనలు వర్తిస్తాయి* *నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు.*

Author
Posted By RK SAKSHI
| 05 Nov 2026, 07:21 PM | TELANGANA
*జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు - జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్*    *ముందస్తు అనుమతులు లేకుండా ప్రజా బహిరంగ కార్యక్రమాలు, సభలు, ర్యాలీలు నిషేధం.*   *నవంబర్ 30వ తేదీ వరకు నిబంధనలు వర్తిస్తాయి*    *నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు.*

సూర్యాపేట : శాంతి భద్రతల పరిరక్షణ దృశ్య, జిల్లాలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా, జిల్లాలో ఉన్న ప్రశాంత వాతావరణం భంగం కాకుండా, సవ్యంగా కొనసాగించడానికి ఈనెల 30 తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... 30 పోలీస్ ఆక్ట్ అమల్లో ఉన్నందున జిల్లాలో డిఎస్పి లేదా ఆ పై స్థాయి అధికారుల నుండి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ప్రజా సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమి గుడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించరాదని మరియు సన్నాహాలు చేయరాదని తెలిపారు. నిషేధిత ఆయుధాలు, కత్తులు, కర్రలు, దుడ్డు కర్రలు, తుపాకులు, పేలుడు పదార్థాలు, దురుద్దేశంతో నేరాలను ఉసిగొలిపేటువంటి ఆయుధాలు కలిగి ఉండరాదని పేర్కొన్నారు. ప్రజా జీవనానికి ఇబ్బంది దారి తీసే ప్రజా సమావేశాలు, జన సమూహం లాంటివి పూర్తిగా నిషేధించబడ్డాయని, అధిక శబ్దం వచ్చే స్పీకర్లు, డీజేలు వంటివి వాటికి అనుమతులు లేవని తెలిపారు. ప్రచార రథాలు, మైకులు, తదితర అధిక శబ్దం పరికరాలు నిషేధించబడ్డాయని సూచించారు. చట్ట ప్రకారం జారీ చేసిన ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే 30 పోలీస్ ఆక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలకు తప్పవు అని సూచించారు. నిబంధనలను తప్పనిసరిగా ప్రతి ఒక్కరు పాటించాలని తెలిపారు. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న ముందస్తుగా దరఖాస్తు చేసుకొని అనుమతులను పొందాలని సూచించారు.

అత్యధికంగా చదివినవి
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి.   ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి.   కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి.   తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..*   *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.*   * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..* *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.* * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.