Loading Time...
Search
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
Install App

*సమాజ సేవ ఏ లక్ష్యంగా శ్రీ వాసవి సేవా సమితి సేవలు*

Author
Posted By RK SAKSHI
| 12 Nov 2026, 05:22 AM | Bhakti
*సమాజ సేవ ఏ లక్ష్యంగా శ్రీ వాసవి సేవా సమితి సేవలు*

సూర్యాపేట టౌన్ :
సమాజసేవయే లక్ష్యంగా శ్రీ వాసవి సేవా సమితి సేవలు అందిస్తుందని శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బచ్చు పురుషోత్తం తెలిపారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్ లో శ్రీ వాసవి సేవా సమితి వ్యవస్థాపక జాతీయ చైర్మన్ పూరి సురేష్ శెట్టి 55వ జన్మదిన సందర్భంగా పేద ప్రజలకు అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ సేవ లక్ష్యంగా గత పది సంవత్సరముల క్రితం వనపర్తికి చెందిన పూరి సురేష్ శెట్టి శ్రీ వాసవి సేవా సమితి స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోనీ పలు రాష్ట్రాలలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భయంకరమైన కరోనా సమయంలో ఆనందయ్య మందును పంపిణీ చేసి ప్రాణదాతలుగా నిలిచారని తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జనవరి 25 న శ్రీ వాసవి సేవా సమితి స్థాపించి ఎంతో మంది పేద ప్రజలకు సేవలందిస్తున్నట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి సేవా సమితి ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి నాగరాజు కోశాధికారి సోమ ప్రవీణ్ కుమార్ ఉపాధ్యక్షులు మిర్యాల సుధాకర్, పోతుగంటి వెంకటేశ్వర్లు సహాయ కార్యదర్శి లు బచ్చు శ్రీనివాస్, తోనుకునూరి కృష్ణమూర్తి, కమిటీ సభ్యులు తప్సీ గాంధీ, కలకోట లక్ష్మయ్య, వందనపు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

అత్యధికంగా చదివినవి
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ మార్గం కల్పించాలి.   ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో గొంతు ఎత్తాలి.   కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి.   తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..*   *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.*   * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ..* *తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ* *శుభాకాంక్షలు.* * తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్.